భారతదేశం, ఫిబ్రవరి 24 -- Pedakakani Tragedy : గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో నలుగురు మృత్యువాత పడ్డారు. పెదకాకాని కాలీ ఆశ్రమంలో విద్యుత్ షాక్ తో నలుగురు కార్మికులు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు తెనాలికి చెందిన వారుకాగా, మరొకరు దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు....మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. నలుగురి మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందోనని పెదకాకాని పోలీసులు, ఎలక్ట్రికల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

గోశాలలో నలుగురు చనిపోయిన సంపులను ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. "గోశాలలో 70 ఆవులున్నాయి. వాటి మూత్రం, పేడను ఓ సుంపులో డంప్ చేస్తున్నారు. ఈ సంపును రోజూ శుభ్రం చేస్తారు. అయితే సోమవారం సంపును శుభ్రపరుస్తు్న్న సమ...