Hyderabad, జనవరి 31 -- బరువు తగ్గాలనుకునే వారు, పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలనుకున్న వారు ఇటీవల కాలంలో మిల్లెట్స్ తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అత్యంత పోషక విలువలున్న సజ్జలు కూడా అందులో ఒకటి. సూపర్ ఫుడ్ లలో ఒకటైన ఈ సజ్జలతో కిచిడి, కీర్, మఠారి, లడ్డూ, రొట్టెలు లాంటివి తయారుచేసుకుని తింటుంటారు. వాస్తవానికి కొన్ని ప్రాంతాల్లో సజ్జలతో చేసిన రొట్టెలు చాలా ఫ్యామస్ కూడా. శీతాకాలంలో చాలా ఎక్కువ మంది వీటిని తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ప్రొటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషక విలువల్లో ఏ మాత్రం తక్కువ కాని సజ్జలకు అంత క్రేజ్ మరి.

ఇంతటి ఆరోగ్యకరమైన ఫుడ్ కొందరికి మాత్రం సరిపడదని తెలుసా. ? అసలు దీనిని తీసుకుందామనే ఆలోచన కూడా చేయకూడదట. అలాంటి వారెవరో, ఎందుకు సరిపడదో తెలుసుకుందామా?

ఆరోగ్య నిపుణుల ప్రకారం, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవా...