Hyderabad, ఏప్రిల్ 17 -- Payal Radhakrishna About Chaurya Paatam Telugu Dubbing: కన్నడలో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటిఫుల్ పాయల్ రాధాకృష్ణ తెలుగులో కూడా కథానాయికగా అలరిస్తోంది. తరగది గది దాటి ఓటీటీ వెబ్ సిరీస్, ప్రసన్నవదనం సినిమాలో హీరోయిన్‌గా చేసింది పాయల్ రాధాకృష్ణ.

ఇప్పుడు కన్నడ బ్యూటి పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా చేసిన లేటెస్ట్ తెలుగు మూవీ చౌర్య పాఠం. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా వ్యవహరించిన డార్క్ క్రైమ్ కామెడీ మూవీ చౌర్య పాఠం సినిమాతో ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అలాగే, కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న చౌర్య పాఠం మూవీకి చూడమణి సహ నిర్మాతగా ఉన్నార...