భారతదేశం, ఏప్రిల్ 5 -- Pawan Kalyan Tour Cancelled : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రేపు భద్రాచలంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సీతారాముల కల్యాణం సందర్భంగా నేడు, రేపు పవన్ కల్యాణ్ భద్రాచలంలో పర్యటించాలని భావించారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. రాత్రికి భద్రాచలంలో బస చేసి, రేపు సీతారాముల కల్యాణం సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలను సీతారాములకు సమర్పించాలని షెడ్యూల్ ప్రకటించారు.

ఆదివారం సాయంత్రం 5 గంటలకు భద్రాచలం నుంచి తిరుగుపయనమై రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవాలని పవన్ కల్యాణ్ ముందుగా భావించారు. అయితే భద్రాచలం పర్యటనను పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. భద్రాచలం సీతారాముల కల్యాణం వీక్ష...