Hyderabad, మార్చి 25 -- Pawan Kalyan Thalapathy Vijay: టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి చాలా కాలమే అవుతోంది. ఈ అనుభవం అతనికి గత ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడింది. ఇప్పుడదే అనుభంతో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కి ఓ సలహా ఇస్తున్నాడు. విజయ్ తన చివరి మూవీ జన నాయగన్ తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.

దళపతి విజయ్ ఇప్పటికే తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో పాల్గొనడానికి అతడు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. అతనికి ఓ సలహా ఇచ్చాడు. ఏది ఏమైనా జనాన్ని వదిలి వెళ్లకు అని స్పష్టం చేశాడు.

"అతనికి నా సూచనలు అవసరం లేదు. అతడు చాలా అనుభవజ్ఞుడు. తనకు సొంత ప్రయాణం ఉంది. క...