భారతదేశం, ఏప్రిల్ 10 -- సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు ఆ వెంటనే పవన్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే పవన్ కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

"మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు" అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు.

"రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో...