భారతదేశం, ఏప్రిల్ 9 -- Pawan Kalyan Son : సింగపూర్ సమ్మర్ క్యాంపులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. బ్లాక్ స్మోక్ పీల్చడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అనంతరం పవన్ కల్యాణ్ , చిరంజీవి దంపతులు సింగపూర్ బయలుదేరి వెళ్లారు. అయితే తాజాగా మార్క్ శంకర్ ఫొటో ఒకటి వైరల్ అవుతుంది. ఆక్సిజన్ మాస్క్, చేతికి కట్టుతో ఉన్న బాలుడి ఫొటో వైరల్ అవుతుంది.

అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ కు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మార్క్ శంకర్ కు పెద్దగా ప్రమాదమేం లేదని, క్షేమంగానే ఉన్నారని పవన్ కల్యాణ్, చిరంజీవి తెలిపారు. మార్క్ శంకర్ కు ప్రమాదం జరిగిందని తెలిసి ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్...