భారతదేశం, ఏప్రిల్ 8 -- Pawan Kalyan Son : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసింది. పవన్ చిన్న కుమారుడి ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. పవన్‌ కల్యాణ్ కు మోదీ ఫోన్‌ చేసి బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడ్డారు. బాలుడి కాళ్లు, చేతులకు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్ కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి, కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. మార్క్‌ శంకర్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించి, పవన్‌కు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తూ, అవసరమై...