భారతదేశం, మార్చి 15 -- Pawan Kalyan On Hindi : దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారనే వాదనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...జనసేన 12వ ఆవర్భావ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్‌ చేస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అన్ని భాషలు అవసరమేనంటూ పరోక్షంగా తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలకు డీఎంకే పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు.

"ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం... రెండూ మన దేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవు. నేను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే నేను వ్యతిరేకించాను. NEP ...