Hyderabad, మార్చి 24 -- Pawan Kalyan on Acting: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ సినిమాల్లో ఇంకెంత కాలం కొనసాగుతాడు? ఈ ప్రశ్నకు పవనే ఈ మధ్య తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు. తనకు డబ్బు కావాలి కాబట్టే తాను ఇంకా సినిమాల్లో నటిస్తున్నానని, అలాగే కొనసాగుతాననీ చెప్పడం విశేషం.

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గత ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని చోట్లా విజయం సాధించిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు పవన్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దీనిపై తాజా ఇంటర్వ్యూలో పవన్ స్పందించాడు.

"నేను హెన్రీ డేవిడ్ తోనీ, యోగులు లేదా సిద్ధుల నుంచి స్ఫూర్తి పొందుతాను. నిస్వార్థంగా ప్రజల కోసం పని చేస్తూనే ఉండాలి. నేను అదే ఆలోచనతో ఉంటాను. నేనెప్పుడూ సంపద...