భారతదేశం, ఏప్రిల్ 9 -- సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. ఆ పిల్లాడి చేతులకు, కాళ్లకు గాయలవడంతో పాటు ఊరితిత్తుల్లోకి పొగ చేరింది. తన కుమారుడిని చూసేందుకు సింగపూర్ వెళ్లారు పవన్ కల్యాణ్. ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా వెంట వెళ్లారు. ఈ తరుణంలో ఏడేళ్ల మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కల్యాణ్ టీమ్ అప్‍డేట్ వెల్లడించింది.

సింగపూర్‌ చేరుకున్న పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి వెళ్లారని ఆయన టీమ్ తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్‌ను పవన్ చూశారని వెల్లడించింది. చేతులు, కాళ్లకు గాయాలవటంతో ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో శంకర్‌కు ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారని తెలిపింది. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుం...