భారతదేశం, ఫిబ్రవరి 1 -- Pawan Kalyan : కేంద్ర బడ్జెట్ సంక్షేమం, సంస్కరణలు సమపాళ్లుగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వ్యవసాయ, రైతాంగ, పారిశ్రామిక, సైన్స్ & టెక్నాలజీ, ఔషద, విమానయాన, మౌలిక రంగాల్లో సమూల మార్పులు చేస్తూ పేదరికం తగ్గించే దిశగా బడ్జెట్ రూపొందించారన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా, దేశాన్ని అభివృద్ధిలో నడిపించేలా బడ్జెట్ ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

"ఆదాయ పన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరటగా నిలిచింది. ఒకేసారి 5 లక్షల పన్ను మినహాయింపు చేస్తూ 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచడం సాహసోపేతమైన నిర్ణయం" - పవన్ కల్యాణ్

"ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలో రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వం పార్లమె...