భారతదేశం, మార్చి 22 -- Pawan Kalyan : రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం పాండ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా పుడిచర్ల గ్రామంలో పంట కుంట నిర్మాణానికి పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్ఠం చేస్తున్నామన్నారు. బలమైన, అనుభవజ్ఞులైన చంద్రబాబు...సీఎంగా ఉండబట్టే పల్లె పండుగ విజయవంతం అయ్యిందన్నారు. మే నెలాఖరు లోపు 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

"ఈ రోజు మనం పల్లె పండుగ, జాతీయ ఉపాధి హామీ పథకాల అమలు, రోడ్ల నిర్మాణాలు ఇంత సమర్ధవంతంగా చేస్తున్నాం అంటే దానికి ఇద్దరు కారణం. ఐఏఎస్ అధికారులు శశి భూషణ్, కృష్ణ తేజ, వారికి నా హృదయప...