భారతదేశం, ఏప్రిల్ 8 -- Pawan Kalyan : సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తేలిపారు. హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని, పొగ పీల్చడంతో వైద్యులు పరీక్షలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతానికి ప్రమాదం లేదని అంటున్నా, పొగ పీల్చడంతో వైద్యులు పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. వైద్యులు బ్రాంకోస్కోపి చేస్తున్నారన్నారు. దీర్ఘకాలంలో పిల్లాడిపై దీని ప్రమాదం ఉంటుందన్నారు. ప్రమాద తీవ్రత ఇంత ఎక్కువ ఉంటుందని ఊహించలేదన్నారు. పెద్ద కుమారుడు అకీరా నందర్ పుట్టిన రోజు నాడే అనుకోకుండా చిన్న కుమారుడికి ఇలా ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. తన కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Published by HT Digital Content Services...