భారతదేశం, ఫిబ్రవరి 18 -- Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళాలో పవిత్రస్నానం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ కు వెళ్లిన పవన్ కల్యాణ్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. గంగమ్మతల్లికి పూజలు చేసి, హారతులిచ్చారు. పవన్ కల్యాణ్ తో పాటు ఆయన సతీమణి అన్నా లెజ్‌నేవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహా కుంభమేళాలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇందుకు సంబంధిత ఫొటోను ఆయన ఎక్స్‌ లో పంచుకున్నారు. మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మత, ఆధ్యాత్మిక వేడుక అన్నారు. సనాతన సంప్రదాయం, వారసత్వానికి ఇదో గొప్ప ప్రతీకగా వెంకయ్య పేర్కొన్నార...