భారతదేశం, జనవరి 26 -- Pawan Kalyan : ఏపీలో ఇటీవల డిప్యూటీ సీఎం, సీఎం పదవులపై టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరుపార్టీల నేతలు, శ్రేణులు మీడియా ముందు, సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలు తెలిపారు. ఈ విషయంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం అని పవన్ గుర్తుచేశారు.

"ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, చట్ట సభల్లో వైసీపీ జుగుప్పాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫ్యల్యాలపై, అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు, సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం అభివృద్ధిని గ...