భారతదేశం, ఫిబ్రవరి 25 -- Pawan Kalyan : సంకీర్ణ ప్రభుత్వంలో సమస్యలు ఉంటాయని, ఏం జరిగినా 15 ఏళ్లు కలిసే ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మాన చర్చలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..."కింద పడతాం... మీద పడతాం... నన్ను ఒక మాట అన్నా సరే... అది మా కుటుంబ విషయం. ఏం జరిగినా మేము 15 సంవత్సరాలు కలిసే ఉంటాం. వైసీపీని సభలో అడుగుపెట్టనివ్వం, అధికారంలోకి రానివ్వం" అన్నారు. నిన్న సభలో వైసీపీ నేతల విధ్వంసం చూస్తే వివేకా హత్య గుర్తొచ్చిందన్నారు.

గవర్నర్‌ ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు అలా ప్రవర్తించవచ్చా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు గొడవలు, బూతులకు పర్యాయ పదంగా మారిపోయారన్నారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు ఎలా తట్టుకుని నిలబడగలిగారా? ఆయన హ్యాట్సాప్ అన్నారు.

ఎన్డీయే సభ్యులు సభలో బాధ్యతాయుతంగా వ్యవ...