భారతదేశం, మార్చి 15 -- Pawan Kalyan: తమిళనాడులో కొనసాగుతున్న హిందీ భాషా వివాదంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన 'సినిమా డబ్బింగ్' వ్యాఖ్యలపై అధికార డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ స్పందిస్తూ.. ''ఆయనకు రాష్ట్ర రాజకీయాల గురించి ఏమీ తెలియదు'' అని ఆరోపించారు. జాతీయ విద్యా విధానం (nep) 2020 కింద త్రిభాషా విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్న అంశంపై కేంద్రంతో తమిళనాడు ప్రభుత్వం విబేధిస్తోంది. తాజాగా, బడ్జెట్ లోగో నుంచి జాతీయ కరెన్సీ సింబల్ ను తొలగించి తమిళంలో 'రు' ను చేర్చింది.

ఈ నేపథ్యంలో జనసేన ఆవిర్భావ వేడుకల సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డీఎంకే తీరును విమర్శించారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నారని డీఎంకే నేతలు అనడం హిపోక్రసీ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ తమిళనాడుు నాయకులు ఒకవైపు హిందీని వ్యతిరేకిస్తునే, మర...