భారతదేశం, మార్చి 18 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రంతో బాలీవుడ్ నటుడు అభిమన్యు సింగ్ తెలుగులో చాలా పాపులర్ అయ్యారు. ఆ మూవీలో సిద్దప్ప నాయుడు అనే మెయిన్‍ విలన్‍ రోల్‍లో అభిమన్యు మెప్పించారు. దీంతో ఆ క్యారెక్టర్ ఇప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోయింది. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హీరోగా చేస్తున్న 'ఓజీ' చిత్రంలో అభిమన్యు నటిస్తున్నారు. సుమారు 13ఏళ్ల తర్వాత పవన్‍తో మళ్లీ కలిసి నటిస్తున్న అనుభవాలను అభిమన్యు వెల్లడించారు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను చెప్పారు.

2010లో రక్తచరిత్ర మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అభిమన్యు సింగ్ అడుగుపెట్టారు. గబ్బర్ సింగ్ చిత్రంతో తెలుగులో ఫేమస్ అయ్యారు. మరిన్ని చిత్రాలు చేశారు. పవన్ కల్యాణ్‍ గురించి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు అభిమన్యు. వ్యక్తిగా ఏపీ డిప్యూటీ సీఎ...