భారతదేశం, మార్చి 25 -- మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్, తమిళ నటుడు, ఆర్చరీ కోచ్ షిహాన్ హుస్సైనీ (60) మరణించారు. బ్లడ్ క్యాన్సర్‌తో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ నేడు (మార్చి 25) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍కు అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ గురువుగా వ్యవహించారు హుస్సైనీ. ఆయన మృతి పట్ల పవన్ స్పందించారు.

పవన్ కల్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు అని ఉండేది. అయితే, కరాటే శిక్షణ ఇచ్చే సమయంలో కల్యాణ్ పేరుకు పవన్ అని జతచేసింది హుస్సైనీనే. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ అని పేరు మారింది. తన గురువును పవన్ ఎంతో గౌరవించేవారు. ఆయన మరణంతో తీవ్ర వేదనకు లోనయ్యానంటూ నేడు సంతాపం ప్రకటించారు పవన్.

మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణవార్త తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానంటూ ...