భారతదేశం, ఫిబ్రవరి 24 -- Pawan Kalyan: గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో గత ప్రభుత్వ నాయకులు చేసింది ఏ మాత్రం సబబుగా లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అన్నారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినా, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభకు వచ్చినందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ పెద్దలు, ఎమ్మెల్యేలు, గవర్నర్ ప్రసంగాన్ని చించేయడం, ప్రతిపక్ష హోదా కోసం బల ప్రదర్శన చేయడాన్ని తప్పు పట్టారు.

వైసీపికి ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదని, ప్రజలు ఇస్తే వస్తుందని, అత్యధిక మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, గతంలో ప్రభుత్వాన్ని పాలించాము కాబట్టి ప్రతిపక్షంగా గుర్తించాలంటే కుదరదన్నారు. అసెంబ్లీలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు సమంజసంగా లేదన్నారు.

జనసేన కంటే ఒకసీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేదని, ప్రస్త...