భారతదేశం, జనవరి 3 -- Pawan Kalyan: ఇంటర్ తో చదువు ఆపేసినా పఠనం ఆగలేదని, పుస్తక పఠనం విషయంలో రవీంధ్రనాథ్ ఠాగూర్ ఓ స్ఫూర్తి అని ఆయన కూడా చదువు తక్కువే చదివినా ఎన్నో కావ్యాలు రాశారని క్లాస్ రూం పుస్తకాలు చదవకున్నా, పఠనం మాత్రం ఎప్పుడూ ఆపలేదని ఇంటర్ తో చదువు ఆపేసినా కూడా ప్రకృతి ప్రేమికుడిగా మారి నాకేం కావాలో తెలుసుకొని దాన్ని చదవడం ద్వారా జ్ఞానం పెంచుకున్నానని పవన్ వివరించారు. స్వతంత్రంగా నాకు ఏం కావాలో నేర్చుకోగలను అనే ధైర్యం వచ్చినపుడు పఠనం మీద దృష్టి నిలిపి నాకు ప్రత్యేకంగా టీచర్ అవసరం లేదని నిర్ణయించుకున్నానని నాకు ఓటమిలోనూ అద్భుతమైన మానసిక శక్తిని పుస్తకాలే అందించాయన్నారు.

జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది పుస్తకాలేనని నిరాశలో ఉన్నపుడు దారి చూపింది పుస్తకాలేనని 2047కు వికసిత భారత్ గా వేగంగా అడుగులు వేస్తున్న వేళ విజ్ఞాన కాంతులు నిండే సమూ...