Hyderabad, ఫిబ్రవరి 27 -- కారంగా రుచిగా ఉండే మసాలా పావ్ భాజీ రుచి ఎవరికీ నచ్చదు? పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ దీన్ని చాలా ఆసక్తితో తింటారు. అనేక రకాల కూరగాలతో కలిపి చేసే ఈ పదార్థం ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు చాలా రుచిగా ఉంటుంది. అందుకే అందరూ ఇష్టంగా తింటారు. కానీ పావ్ భాజీ తయారు చేయడమే చాలా కష్టం. దీని తయారీకి శ్రమతో పాటు ఎక్కువ సమయం పడుతుందని చాలా మంది గృహిణులు చెబుతుంటారు. అందుకే ప్రతిసారి బయట కొరుక్కుని తినాల్సి వస్తుందని ఫిర్యాదు చేస్తుంటారు.

మీరు కూడా కేవలం ఇందుకే పావ్ భాజీ ఇంట్లో తయారు చేసుకోకుండా ఆగిపోతుంటే ఈ రెసిపీ మీ కోసమో. ఈ చిట్కాలు పాటించారంటే స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీని చాలా ఈజీగా కేవలం 20నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందుకు ప్రెషర్ కుక్కర్ తప్పనిసరి. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి..

Published by HT Digital Content S...