Hyderabad, ఫిబ్రవరి 26 -- John Abraham Hints Shahrukh Khan Pathaan Prequel: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించిన పఠాన్ 2023లో విడుదలైన బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో షారుక్, దీపికా కెమిస్ట్రీ, యాక్షన్స్ అదిరిపోగా విలన్‌గా జాన్ అబ్రహం ఎంతగానో ఆకట్టుకున్నాడు.

సొంత సంస్థ తనను ఆదుకోలేదన్న కోపంతో రగిలిపోయే జిమ్ పాత్రలో ఆవేదన, ఆక్రోషం, పగ వంటి ఎమోషన్స్‌ను జాన్ అబ్రహం బాగా పలికించాడు. అయితే, ఇప్పుడు ఆ పాత్రపై సెపరేట్‌గా సినిమా తెరకెక్కించునన్నారట. ఈ విలన్ రోల్‌పైనే పఠాన్‌కు ప్రీక్వెల్ తీసే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు జాన్ అబ్రహం.

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్ తన పాత్ర జిమ్‌తో పఠాన్ ప్రీక్వెల్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. అయితే, అయితే పఠాన్ స...