భారతదేశం, జనవరి 29 -- షారుఖ్ ఖాన్(Sharukh Khan) నటించిన పఠాన్(Pathaan) బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తూనే ఉంది. అత్యంత వేగంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇండియాలో పఠాన్ 4వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ 55 కోట్లుగా ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ చిత్రం తొలిరోజు రూ. 57 కోట్లు, రెండో రోజు రూ.70.50 కోట్లు, మూడో రోజు రూ.39.25 కోట్లు వసూళ్లు చేసింది. జనవరి 26 సెలవుదినం కావడంతో భారీగా వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత మూడో రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.

పఠాన్ 4వ రోజు బాక్సాఫీస్ వసూళ్లను వివరిస్తూ, బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పఠాన్ మూడు రోజుల్లో రూ.313 కోట్లు(గ్రాస్). 300 కోట్ల మార్కును అధిగమించిన వేగవంతమైన హిందీ చిత్రంగా నిలిచింది(ఓవర్సిస్ ప్లస్ ఇండియా గ్రాస్).

విడుదలైన మొదటి మూడు...