భారతదేశం, మార్చి 26 -- Pastor Praveen Pagadala : రాజమండ్రి శివారులో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందారు. ఈ ఘటన సంచలనం అయ్యింది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డీజీపీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. పాస్టర్‌ ప్రవీణ్ కుమార్ మృతిపై వస్తున్న ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. హోంమంత్రి అనిత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌కు ఫోన్‌ చేసి జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీకెమెరాలను పరిశీలించాలని ఆదేశించారు.

పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు. పోలీస...