భారతదేశం, మార్చి 29 -- పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి కేసుపై స్పందించారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌ కుమార్. ఈ నెల 24న పాస్టర్‌ ప్రవీణ్‌ హైదరాబాద్‌ నుంచి బయల్దేరారని చెప్పారు. విజయవాడలో 3,4 గంటలపాటు ఉన్నారన్న ఐజీ.. ఎవర్ని కలిశారు, ఏం చేశారు అనేదానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఏలూరు రేంజ్‌ ఐజీ చెప్పిన 9 కీలక విషయాలు ఇలా ఉన్నాయి.

1.ఈ కేసును స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 40 నిమిషాలు ఈ కేసుపై సమీక్ష నిర్వహించారు. డీజీపీ కూడా ఎప్పటికప్పుడు దీనిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తు పురోగతి గురించి తెలుసుకుంటున్నారు.

2.ఈనెల 24వ తేదీన హైదరాబాద్‌ నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరారు. మధ్యాహ్నం ఒంటిగంటకు చౌటుప్పల్ టోల్ ‌గేట్ దాటారు.

3.విజయవాడకు వచ్చాక 3 నుంచి 4 గంటలు ఏం చేశారనేది తెలియలేదు. ట్రాక్ చేస్తున్నాం. విజయవాడలో ఆయన ఎవరిని కలిశారు. ఎక్...