భారతదేశం, ఏప్రిల్ 12 -- పాస్టర్ ప్రవీణ్ మృతిపై రాజమండ్రిలో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఐజీ అశోక్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీతో కలిసి వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారని స్పష్టం చేశారు. అందుకు తగ్గ ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇకపై దీని గురించి ఎవరూ సోషల్ మీడియాలో తప్పుగా పోస్టులు చేయొద్దని సూచించారు.

'పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టాం. ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టాం. ప్రవీణ్‌కు సంబంధించి పలుచోట్ల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని ప్రవీణ్ కుటుంబసభ్యులు చెప్పారు' అని ఐజీ అశోక్ కుమార్ వివరించారు.

'సోషల్ మీడియాలో మాట్లాడినవారు ...