భారతదేశం, మార్చి 26 -- Paster Praveen Pagadala : పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు పలు కీలక విషయాలు వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రవీణ్ బైక్ పై ప్రయాణిస్తున్న రెండు సీసీ ఫుటేజీలు లభించాయని చెప్పారు.

హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై రాజమండ్రికి వస్తున్న సమయంలో సోమవారం అర్ధరాత్రి 11 గంటల 42 నిమిషాలకు ఒక కారుతో పాటు ఐదు వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ని దాటుకొని వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో గుర్తించామన్నారు. రెడ్ కలర్ కారు, ప్రవీణ్ బైక్ ఒకేసారి వెళ్లాయని, ఆ కారు కోసం విచారణ చేస్తున్నామన్నారు.

హైదరాబాద...