భారతదేశం, మార్చి 5 -- Passport rules: కొత్తగా భారతీయ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు లేదా తమ పాస్ పోర్ట్ ను అప్ డేట్ చేసుకోవాలనుకునేవారు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. పాస్ పోర్ట్ దరఖాస్తు నిబంధనలను ప్రభుత్వం అప్డేట్ చేసింది. పాస్ పోర్ట్ కోసం అప్లై చేయడానికి ముందు గుర్తుంచుకోవలసిన ఐదు కీలక అప్ డేట్స్ ఇక్కడ ఉన్నాయి.

అక్టోబర్ 1, 2023 న లేదా ఆ తరువాత జన్మించిన వ్యక్తుల పుట్టిన తేదీకి సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్, జనన మరియు మరణాల రిజిస్ట్రార్ ద్వారా జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రం కానీ లేదా జనన మరియు మరణాల నమోదు చట్టం, 1969 కింద నియమించబడిన ఏదైనా అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాన్ని కానీ జనన ధృవీకరణ పత్రంగా సమర్పించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా వేరే ధృవీకరణ పత్రాలను అంగీకరించరు. అలాగే, అక్టోబర్ 1, 2023 కంటే ముందు జన్మించిన వారు...