భారతదేశం, ఏప్రిల్ 14 -- Park Hyatt Fire Accident : హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ ప్లేయర్లకు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాద సమయంలో ఎస్ఆర్.హెచ్ ప్లేయర్లు హోటల్ ఆరో అంతస్తులో ఉన్నారు. ప్రమాద విషయం తెలిసి ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అక్కడి నుంచి బస్సుల్లో వెళ్లిపోయారు. వైరింగ్ సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. మంటలను ఆర్పివేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు.

బంజారాహిల్స్ పార్క్‌హయత్‌‌లో అగ్ని ప్రమాదం జరిగింది. పార్క్‌హయత్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన హోటల్ కు చ...