Hyderabad, జనవరి 27 -- తల్లిదండ్రులు అవుతున్నారనే విషయమే జీవితంలో అత్యంత సంతోషకరమైన సందర్భం. మొదటిసారి తల్లిదండ్రులు అవుతున్నారంటే అది చాలా ఎగ్జైటింగ్‌గానూ, కుతూహలంగానూ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ మొత్తాన్ని తొలిసారి పుట్టిన సంతానంపై చూపించేస్తాం. అలా కొన్నేళ్ల పాటు పెరిగిన తర్వాత ఇంటికి రెండో సంతానం వస్తుందంటే, ఎలా ఉంటుంది? మనం చూపించాల్సిన ప్రేమ కూడా ఇద్దరికీ షేర్ చేయాల్సి ఉంటుంది. దానిని అప్పటిదాకా తమ చుట్టూనే అమ్మానాన్న ఉంటారని భావించిన ఫస్ట్ బేబీ ఈ విషయాన్ని ఎలా తీసుకోగలరనే విషయాన్ని పరిశీలిద్దాం.

తనకు తోబుట్టువు రాబోతున్నారనే ఆనందం చిన్నారుల్లో కచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత రెండో బిడ్డతో కలిసి విషయాలను పంచుకోవడంలో కాస్త ఆందోళన చెందుతుంటారు. ఇంకా గారాభం మొత్తాన్ని చివరి సంతానంపై చూపిస్తుంటే, బాధ్యతాయుతమైన తోబుట్టువు పెద్ద బిడ్డ వ్యవహరించా...