Hyderabad, జనవరి 28 -- తల్లిదండ్రులుగా పిల్లలకు మంచేది, చెడు ఏది అని చిన్నప్పటి నుంచే చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. కాకపోతే దానికి కూడా కొన్ని షరతులు, హద్దులు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి వారిపై అరుస్తూ వారిని అది చేయద్దు, ఇది చేయద్దు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటుంటే అది వారికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. వారి ఎదుగుదలకు కూడా ఆటంకం కలిగిస్తుందని గుర్తుంచుకోండి. ముఖ్యంగా కొన్ని పనులు చేసేటప్పుడు పిల్లలకు ఆపడం వల్ల మీరు చాలా పెద్ద పొరపాటు చేసిన వారు అవుతారు. అవేంటో తెలుసుకుని మీ పిల్లల దృష్టిలో మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మారండి.

మీ బిడ్డ కొన్ని విషయాలను నేర్చుకోవడానికి, చూడటానికి ఇష్టపడతాడు. అలాంటప్పుడు వారిని ఆపకండి. ఇలా చేస్తేనే వారి అభిరుచులు ఏంటో వారికి తెలుస్తాయి. ఆత్మవిశ్వాసం, స్థితిస్థాపకత, జీవన నైపుణ్యాలను పెంపొందించడానిక...