Hyderabad, ఫిబ్రవరి 14 -- పిల్లలకు జన్మనివ్వడం ఒకత్తయితే, వారిని సరైన దారిలో పెంచడం మరో ఎత్తు. కొందరిలో అయితే కనడం కంటే పెంచడమే కష్టమనే అభిప్రాయం కూడా ఉంటుంది. వాస్తవానికి పేరెంట్స్ అంటే, ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే, పిల్లల తీరుతెన్నులను సరైన సమయానికి పట్టించుకోకపోతే పెడదోవ పట్టిన సందర్భాలు కోకొల్లలు. ఈ క్రమంలోనే చాలామంది తల్లిదండ్రులు తమకు తెలియకుండానే పిల్లల మీద తమ కోరికలను రుద్దుతున్నామని గమనించే ఉంటారు. అలా చేయడం కూడా కరెక్టేనని ఫీలవుతుంటారు. ఈ కోరికలను రుద్దే అలవాటు చాలా సార్లు చాలా తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. మీ నిర్ణయాలని బలవంతంగా పిల్లలపై రుద్దితే అది మరింత ప్రమాదకరంగా మారొచ్చు. ఇంకా, మీరు ఒత్తిడితో వారిపై రుద్దే నిర్ణయాలు జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేయొచ్చు.

ఇదే విధంగా కొనసాగితే, ఒకానొక సందర్భ...