Hyderabad, జనవరి 31 -- పిల్లలను సరిగ్గా పెంచడం చాలా సవాలుతో కూడుకున్న పని. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు తల్లిదండ్రులు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పులు వారి పిల్లలపై నెగిటివ్ ఫీలింగ్ ను పెంచుతాయి. పిల్లల వయసు పెరిగే కొద్దీ వారి ఆలోచనల్లో, ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. వారి వయసుకు తగ్గట్టు తల్లిదండ్రులు ప్రవర్తించాలి. తల్లిదండ్రులు చేసే పనులు కొన్ని పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపించి వారిలో శత్రుత్వం పెరిగేలా చేస్తాయి. చాలాసార్లు తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్లు వారిలో ద్వేషాన్ని పెంచేస్తాయి.

వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో అనేక మార్పులు వస్తుంటాయి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పిల్లవాడు కొత్తగా ఫీలవుతాడు. ప్రేమ, ఆకర్షణ, మమకారం, అసూయ, ఎవరిపైనైనా దూకుడుగా మాట...