Hyderabad, ఫిబ్రవరి 8 -- పిల్లలంటే ఇష్టం ఉండొచ్చు. కానీ, అది అతి కాకూడదు. మరీ బొమ్మరిల్లు ఫాదర్‌లాగా ప్రతి విషయం నేనే చూసుకుంటా. వాళ్ల ముందు నేనే ఒక షీల్డ్ అని ఫీలైపోయి బిహేవ్ చేయకండి. ఇలా చేయడం వల్ల ఒకానొక దశలో వారు మానసికంగా దూరం అయిపోతారు. లేదంటే పూర్తిగా మీ మీదే డిపెండ్ స్వతహాగా ఆలోచించడం ఆపేస్తారు. వాస్తవిక ప్రపంచంలో ఈ రెండూ ప్రమాదకరమే. ప్రేమగా దగ్గరుండి నేర్పించాలి. కానీ, అంతా మనమై నడిపించడం వల్ల వారి ఎదుగుదలను అడ్డుకున్న వాళ్లమవుతాం. మరి మీ పిల్లలతో మీరెలా ప్రవర్తిస్తున్నారు. ఓవర్ ప్రొటెక్టివ్ (అతి జాగ్రత్త)గా వ్యవహరిస్తున్నారా..? ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా? అయితే వెంటనే మార్చుకోండి.

మీ పిల్లలు పరీక్షలు, కాంపిటీషన్లలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఆందోళన చూపిస్తుంటారు. ఫలితాలు, స్కోర్లు, మెడల్స్ వంటి అంశాలనే లక్ష్యంగా ఉంచుక...