Hyderabad, డిసెంబర్ 28 -- తల్లిదండ్రులందరూ తమ పిల్లలలో మంచి ఆలోచనలు, ఉన్నతమైన విలువలు పెంపొందించాలని కలలు కంటారు. కానీ చాలాసార్లు తెలిసో తెలియకో అంటే చెడు సహవాసం లేదా చుట్టు పక్కల ఉండే చెడు వాతావరణం వారిని చెడగొడుతుంది. దీని వల్ల పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, గౌరవం ఇవ్వరు. చెడు మార్గాలకు, చెడు అలవాట్లకు ఎక్కువ ఆకర్షితులు అవుతారు. ఇది వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వారి వ్యక్తిత్వాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. విజయానికి వారిని దూరం చేస్తుంది.

ఇలా జరగకుండా ఉండాలంటే పిల్లలలో విలువలు పెంపొందిచాలంటే చిన్నతనంలోనే మీరు పునాది వేయాల్సి ఉంటుంది. విలువలతో కూడిన భవిష్యత్తునూ విజయాన్ని వారికి అందించాలంటే చిన్ననాటి నుంచే వారికి కొన్ని విషయాలను జాగ్రత్తగా నేర్పించాల్సి ఉంటుంది. బాల్యంలో ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు నేర్పించా...