Hyderabad, మార్చి 20 -- పిల్లలు ఎదిగే కొద్దీ తల్లిదండ్రుల బాధ్యత పెరుగుతుంది. వారికి మంచి చెడులు నేర్పి, వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన పెద్ద బాధ్యత వారిదే. పిల్లలకు తినడం దగ్గర నుంచి నిద్రపోవడం వరకు ఎన్నో పనులు వారికి నేర్పించాలి. పరిశుభ్రత, క్రమశిక్షణను వంటివి వారిలో పెంపొందించేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రులతో పడుకోవడం సహజం. అయితే ఒక వయసు వచ్చాక మాత్రం వారిని విడిగానే పడుకోబెట్టాలి.

పిల్లలు పుట్టినప్పట్నించి తల్లిదండ్రుల పక్కన నిద్రపోతారు. అయితే వారికి 8 నుంచి పదేళ్ల వయసు వచ్చేసరికి పిల్లలకు విడిగా పడుకునే అలవాటును నేర్పించాలి. తల్లిదండ్రులు తమతో పాటూ వారిని పడుకోబెట్టుకోకపోవడమే మంచిది.

కొంతమంది పిల్లలు తమ తల్లితో పడుకోవడానికి ఇష్టపడతారు. వారు విడిగా నిద్రపోవడానికి ఇష్టపడరు. ఒంటరిగా పడుకోమని ...