Hyderabad, ఫిబ్రవరి 1 -- తల్లిదండ్రులు చాలా వరకూ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలని ఆశపడతారు. ఈ క్రమంలోనే తమ అనుభవాలను వారితో పంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. కానీ, అలా చేసేటప్పుడు, చాలా సార్లు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. అవి తల్లిదండ్రుల విషయంలో సాధారణమైనవిగానే అనిపించినప్పటికీ, పిల్లల మనసుపై లోతైన ప్రభావం చూపి వారిని తిరుగుబాటుదారులుగా మార్చి ప్రమాదంలో పడేస్తాయట. తల్లిదండ్రులు తమ గతం నుండి కొన్ని విషయాలను పిల్లల వరకూ చేరనివ్వకపోవడమే బెటర్. మరి పిల్లలతో పంచుకోకూడని ఆ 3 విషయాలేంటో తెలుసుకుందాం.

తల్లిదండ్రులు ఎప్పుడూ తమ బాల్యంలో చేసిన ప్రమాదకరమైన స్టంట్లు, ప్రమాదకరమైన ప్రయాణాలు లేదా ప్రమాదకరమైన ప్రవర్తనల గురించి పిల్లలతో చర్చించకూడదు. ఒకవేళ ఇతర సందర్భంలో తెలిసి పిల్లల చెవిన పడినప్పటికీ ఏదో ఒక విషయం చెప్పి డైవర్ట్ చేసేయాలి. అలా కాకుండ...