Hyderabad, ఫిబ్రవరి 7 -- పిల్లల వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంలోనూ, దెబ్బతీయడంలోనూ వారి స్నేహితులతో పాటు వారి తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉంటుంది. పిల్లల్లో మంచి విలువలు, నీతిబోధన చేసేది తల్లిదండ్రులే. కొన్ని విషయాల్లో అమ్మానాన్నల నిర్లక్ష్యం లేదా అజ్ఞానం వల్ల పిల్లల వ్యక్తిత్వం పూర్తిగా బలహీనపడుతుంది, వారిని సోమరిపోతుల్లా మార్చేస్తుంది. ఫలితంగా వారు జీవితాంతా పనిదొంగల్లానే వ్యవహరిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు పిల్లలను సోమరితపోతుల్లా మార్చేస్తాయట. అవేంటో తెలుసుకుని మీ పిల్లల విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పిల్లలు ఎంత చురుగ్గా ఉంటే వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది.

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా, రక్షణాత్మకంగా ఉంటారు. పాఠశాల పనుల నుండి ఆటల వరకు ప్రతి చిన్నపనిన...