Hyderabad, ఫిబ్రవరి 3 -- కొంతకాలంగా దాదాపు అన్ని చోట్లా వినిపిస్తున్న వార్త చిన్నారుల్లో కూడా గుండెపోటుతో మరణాలు సంభవించడం. వృద్ధులు మాత్రమే కాదు, ఏడెనిమిదేళ్ల పిల్లల్లో కూడా గుండెపోటు మరణాలు కలుగుతున్నాయని వింటూనే ఉన్నాం. ఇంత చిన్న వయస్సులోనే అంత పెద్ద సమస్య రావడానికి కారణమేమై ఉండొచ్చు. గుండెపోటు లేదా హార్ట్ అటాక్ పెద్దలలాగే పిల్లల్లోనూ ఒకేలా ఉంటుందా.. దీనికి ప్రధాన కారణమేంటో తెలుసుకుందాం.

గుండెపోటు లేదా హృద్రోగ సమస్యలు పెరగడానికి కారణం మనం అనుసరిస్తున్న పేలవమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఇవే పిల్లల గుండెను ప్రమాదానికి గురయ్యే పరిస్థితులకు దారి తీస్తున్నాయి. పిల్లలను పాఠశాల, ట్యూషన్లతో పాటు పాఠ్యేతర కార్యక్రమాలలో విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. దీనితో పాటు కొంత సమయం దొరికిన కాస్త సమయాన్ని మొబైల్స్‌కు అంకితం అవుతున్నారు. ఇలా చేయడం వల్ల వ...