Hyderabad, మార్చి 5 -- పర్యాటకంలో పారానార్మల్ టూరిజం కూడా ఒక భాగంగా చేరిపోయింది. మనదేశంలో పర్యాటకం అతిపెద్ద సేవారంగం. దేశంలో ఎనిమిది శాతం మంది పర్యాటకం పైనే ఆధారపడి ఉపాధిని పొందుతున్నారు. అయితే భారతదేశంలో పారా నార్మల్ టూరిజం కూడా ఇటీవల కాలంలో బాగా ఆదరణ పొందుతోంది. దీనికి తగ్గట్టు కొన్ని గమ్యస్థానాలు కూడా ఉన్నాయి.

పారా నార్మల్ అనే పదం వింటేనే మీకు అర్థమైపోతుంది. పారా నార్మల్ అనేది అసాధారణ విషయాలకు మాత్రమే ఉపయోగిస్తారు. భయానక ప్రదేశాలను సందర్శించడం, దెయ్యాలు ఉన్న గ్రామాలు అంటూ ప్రచారం జరిగిన ప్రాంతాలకు వెళ్లడం, అసాధారణ సంఘటనలను జరిగిన ప్రదేశాల్లో పర్యటించడం వంటివే పారానార్మల్ టూరిజం. కొందరు ప్రజలకి ఈ పారానార్మల్ టూరిజం పై ఎంతో ఆసక్తి ఉంటుంది.

మనదేశంలో కూడా పారా నార్మల్ టూరిజం పట్ల క్రేజ్ బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా దీనికి కారణం సోషల్ మీడ...