Hyderabad, మార్చి 18 -- పునుగులు అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ క్రిస్పీగా నోరూరించే పునుగలను మీరు ఇప్పటిదాకా గోధుమపిండి, మైదా పిండి, ఇడ్లీ పిండితో వేసుకొని ఉంటారు. ఈసారి కొత్తగా పప్పులతో పునుగులను ట్రై చేసి చూడండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పప్పులలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి కనుక వీటిని తినడం ఆరోగ్యకరం కూడా. ఇంతకీ వీటిని ఏయే పప్పులతో తయారు చేయాలి, ఎలా చేయాలి? సింపుల్ రెసిపీ ఇక్కడుంది తెలుసుకుందాం రండి.

వీటిని మీరు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా తినచ్చు, సాయంత్రం స్నాక్స్ గా కూడా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు తిన్నా మితంగా తింటే ఇవి మీ ఆరోగ్యానికి మేలు చేయడమే కాక చిరుతిళ్లు తినాలనే మీకు కోరికను తీరుస్తాయి. ముఖ్యంగా పిల్లలైతే వీటిని రుచి చూశాక వారానికి మూడు సార్లు ఇవే కావాలని అడుగ...