Hyderabad, ఏప్రిల్ 5 -- శ్రీరామనవమికి రాముడికి ఇష్టమైన నైవేద్యాలు పానకం, వడపప్పు. ఆ రెండు రాముడి పూజలో కచ్చితంగా ఉండాల్సిందే. కేవలం శ్రీరామనవమి కాదు తెలుగు వారి ప్రతి పెళ్లిలో కూడా పానకం కనిపిస్తూ ఉంటుంది. శ్రీరామనవమి అనేది వేసవిలో వచ్చే పండుగ.

ఈ వేసవిలో పానకం, వడపప్పు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే శ్రీరామనవమి ప్రసాదాలుగానే కాదు ఇది సీజనల్ వ్యాధులను తగ్గించే సీసనల్ ఫుడ్స్ కూడా. మన పండగలకు సీజన్లో పట్టే ప్రసాదాలు కూడా పూర్వపు పెద్దలు నిర్ణయించారు. వేసవిలో పానకం శరీరానికి చలువ చేస్తుంది. ఇక వడపప్పు తినడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.

శ్రీరామనవమికి రాముడికి సమర్పించే పానకం చివరిలో భక్తులకు అందిస్తారు. పానకం తాగితేనే ఆరోజు రాముడి పూజ భక్తులు పరిపూర్ణంగా చేసినట్టు. వేసవి ఆరంభంలోనే వచ్చే శ్రీరామనవమి రోజు పానకం ఇవ్వడం ...