భారతదేశం, ఫిబ్రవరి 9 -- Palnadu Politics : పల్నాడు జిల్లాలో రాజకీయం హీటెక్కింది. చిలకలూరిపేటలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్బలంతో తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని ఫైర్ అయ్యారు. తాను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ప్రత్తిపాటి ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మాజీమంత్రి విడదల రజినిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు. విడదల రజినికి పీఏలుగా పనిచేసిన జయ ఫణీంద్ర, రామకృష్ణ, చిలకలూరిపేట అర్బన్‌ సీఐ వి.సూర్యనారాయణపై కూడా కేసు నమోదు చేశారు. చిలకలూరిపేటకు చెందిన టీడీపీ దళిత నాయకుడు పిల్లి కోటి 2019లో విడదల రజినిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. రజిని చట్ట వ్యతిరేక కార...