ఆంధ్రప్రదేశ్,పల్నాడు జిల్లా, ఫిబ్రవరి 5 -- భార్య‌తో గొడ‌వ పెట్టుకున్న భ‌ర్త‌. బంధువుల అమ్మాయితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. ఏకంగా సంసారం పెట్టేశాడు. అయితే భర్తపై నిఘా పెట్టిన భార్య. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. దేహ‌శుద్ధి చేసిన బంధువులు వారిని పోలీసులకు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న ప‌ల్నాడు జిల్లా సత్తెనప‌ల్లి ప‌ట్ట‌ణంలోని జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం. సత్తెన‌ప‌ల్లి చెంచుకాల‌నీకి చెందిన ఆకుల వాసుకు, న‌క‌రిక‌ల్లు మండ‌లం చ‌ల్ల‌గుండ్ల గ్రామానికి చెందిన‌ న‌వ్య‌శ్రీ‌తో వివాహం జ‌రిగింది. న‌వ్యశ్రీ స్వ‌యాన అక్క కూతురే. రెండేళ్ల క్రితం వాసు, న‌వ్య‌శ్రీకి వివాహం జ‌రిగింది. ఈ యువ దంప‌తుల‌కు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్లాస్టిక్ వ‌స్తువులు అమ్ముతూ జీవ‌నం సాగిస్తున్నారు.

హైద‌రాబాద్‌లో నివాస‌ముంటున్న బంధువుల అమ్మాయితో వాసుకి ప‌రిచ‌యం ఏర్...