భారతదేశం, మార్చి 3 -- ప‌ల్నాడు జిల్లాలోని స‌త్తెన‌ప‌ల్లి మండ‌లంలోని ఒక గ్రామంలో ఆదివారం దారుణం జరిగింది. ఓ కూలీపై అత్యాచారయత్నం జరిగింది. కూలీలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మిర‌ప‌కాయ‌ల కోత‌ల‌కు ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి ప్రాంతానికి చెందిన కూలీలు ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి మండ‌లంలో ఒక గ్రామానికి నెల కిందట వచ్చారు. కూలీకి వ‌చ్చిన 40 మంది కూలీలు పొలాల్లోనే గుడారాలు వేసుకొని పనులు చేస్తున్నారు. కూలీల్లో ఒక మ‌హిళ అనారోగ్యానికి గురైంది. ఆమె చ‌ల్లన్నం తిన‌కూడ‌ద‌ని.. ఇడ్లీ తేవ‌డానికి ఆమె కుమార్తె సిద్ధ‌మైంది.

కూలీల‌ను గ్రామానికి తీసుకొచ్చిన హ‌నిమిరెడ్డి అనే వ్య‌క్తి ఇడ్లీ కోసం తాను తీసుకెళ్తాన‌ని న‌మ్మించాడు. త‌న మోట‌ర్ సైకిల్‌పైకి ఎక్క‌మ‌న్నాడు. ఆ యువ‌తి మోట‌ర్ సైకిల్ ఎక్కింది. ఆమెను స‌మీపంలోని గ్రామంలో చిన్నపాటి హోట‌ల్‌కు తీసుకెళ్లాడు. అక్క‌డ ...