భారతదేశం, ఫిబ్రవరి 9 -- Palnadu Tractor Accident : పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం మాదల మేజర్ కాలువ కట్టపై కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళలు మిరప పంటకోతలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ట్రాక్టర్ ప్రమాదంలో మధిర గంగమ్మ, మధిర సామ్రాజ్యం, చక్కెర మాధవి, తేనెపల్లి పద్మావతి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రమాదస్థలిని పరిశీలించారు. ట్రాక్టర్ ప్రమాదంపై మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మహిళా క...