Hyderabad, మార్చి 10 -- పామాయిల్ వల్ల గుండెకు చేటు జరుగుతుందని ఎప్పటినుంచో పోషకాహారా నిపుణులు చెబుతున్నారు. బయట దొరికే ఇనిస్టెంట్ నూడిల్స్, చాక్లెట్ క్యూబ్స్, బ్రెడ్లు, కేకులు ఇలా ఎన్నో వాటిలో పామాయిల్ ను వినియోగిస్తారు. ఇలా మనకు తెలియకుండానే పామాయిల్ తో చేసిన ఆహారాన్ని తినేస్తున్నాం. ఇంట్లో పామాయిల్ ను వాడకపోయినా ఇలా బయట దొరికే పామాయిల్ ఫుడ్ ను తినడం వల్ల గుండెలోని ధమనులు మూసుకుపోయే ఛాన్స్ ఉంది.

పామాయిల్ లో దాదాపు 50 శాతం సంతృప్త కొవ్వులు ఉంటాయి. అంటే తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్... దీన్నే చెడు కొలెస్ట్రాల్ అని అంటారు. ఈ చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ పెంచుతుంది. పామాయిల్ తరచూ శరీరంలో చేరితే హృదయ సంబంధ వ్యాధులు ప్రమాదం పెరిగే అవకాశం కూడా ఉంది.

సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే నూనెలు, ఆహారాలు గుండె జబ్బులతో ముడిపడి ఉంటాయి. కానీ బ...