భారతదేశం, ఆగస్టు 4 -- Paleru Farmer Selfie Video : సొంత భూమి కళ్లెదుటే కబ్జాకు గురవుతుంటే రైతు గుండె చెదురుతోంది. అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోని పరిస్థితితో చివరికి బలవంతపు మరణానికి సిద్ధమవుతున్నాడు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాఖాలో సన్నా, చిన్న కారు రైతు ఏలేటి వెంకటరెడ్డి(45) పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాజీ మావోయిస్టుగా చెప్పుకునే జాటోత్ వీరన్న అనే వ్యక్తి ఆగడాలకు వెంకటరెడ్డి పొలం వద్దనే పురుగుల మందు తాగి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.పోలీసుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం, జాన్ పహాడ్ తండాకు చెందిన ఏలేటి వెంకట్ రెడ్డి తనకున్న మూడెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. వెంకట్ రెడ్డి సోదరుడ...